President of Mexico: ట్రంప్ కు చురకలంటించిన మెక్సికో అధ్యక్షురాలు..! 12 h ago
అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమవుతున్న ట్రంప్. ప్రమాణస్వీకారానికి ముందే పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. తాను అధికారంలోకి రాగానే కెనడా, గ్రీన్లాండ్, పనామా కాలువలను విలీనం చేసుకుంటామన్నారు. గల్ఫ్ఆఫ్ మెక్సికోను 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మారుస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ స్పందిస్తూ యూఎస్ ను తామెందుకు 'మెక్సికన్ అమెరికా' అని పిలవకూడదంటూ చురకలంటించారు.